పెద్దకొత్తపల్లి మండలం జొన్నల బొగుడ తండాకు చెందిన భీమ్లా నాయక్ మృతి చెందారు. తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి కేతేపల్లి గ్రామానికి పెయింట్ వేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందాడని తెలిపారు. మృతి చెందిన వ్యక్తికి భార్య ,ఇద్దరు పిల్లలు ఉన్నారు. భీమ్లా నాయక్ మృతి చెందడంతో జొన్నలగూడ తండాలో విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వం కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.