కల్వకుర్తి: రైతు వ్యతిరేక విధానాల పట్ల నిరసన

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను బీఆర్ఎస్ పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నామని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఈ నెల 13న నియోజకవర్గంలోని ఆమనగల్లు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపడుతున్నట్లు గురువారం తెలిపారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్