నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్‌లో ఎద్దుల బండి కిందపడి ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. ఎద్దుల బండి హన్సిక పొలానికి బయలుదేరగా.. ఇంటి సమీపంలోని మలుపు వద్ద ఉన్న రాళ్లపై ఎద్దుల బండి చక్రం ఎక్కడంతో హన్సిక ప్రమాదవశాత్తు కింది పడిపోయింది. తలపై నుంచి బండి చక్రం వెళ్లడంతో చిన్నారి స్పాట్‌లోనే మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.