ఉప్పునుంతల మండలం జప్తి సదగోడు గ్రామానికి చెందిన చలమల శ్రీనివాస్ గౌడ్ నాలుగు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని మొక్కజొన్న పంట సాగు చేశాడు. శనివారం పక్క పొలం వాళ్ళు పంట వ్యర్థాలను అంటిస్తున్న సమయంలో గాలి దాటికి నిప్పురవ్వ వచ్చి ఎండిన మొక్కజొన్న పంటలో పడడంతో మంటలు అంటుకొని పంట నష్టం వాటిల్లినట్లు రైతు వివరించారు.. ఫైర్ సిబ్బంది వచ్చిమంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆదుకోవాలని రైతు కోరారు