అచ్చంపేట: నల్లమలలో ట్రాఫిక్ జామ్

సలేశ్వరం లింగమయ్య స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో నల్లమలలోని శ్రీశైలం-హైదరాబాద్ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆదివారం ఉదయం మన్ననూరు ప్రధాన చెక్ పోస్టు వద్ద టోల్ గేట్ రుసుములను వసూలు చేస్తున్న క్రమంలో 4 కిలో మీటర్ల పొడవునా కుంచోనిమూల వరకు, మన్ననూరు దుర్వాసుల చెరువు చెక్ పోస్టు నుంచి మన్ననూరు వరకు రెండు కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్