నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త సాయి కుమార్ కు పెద్దకొత్తపల్లి మండలానికి చెందిన అనూష తో పెళ్లి నిశ్చయం అయింది. ముహూర్తం టైం దగ్గరికి వచ్చింది. తాళి కట్టకుండా తన పెళ్లికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి వస్తేనే తాళి కడతానని మొండికేసి కూర్చున్నాడు. కార్యకర్తలు విషయం ఎమ్మెల్యేకి తెలపడంతో హుటాహుటిన పెళ్ళికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.