మమ్మాయిపల్లిలో పిడుగుపాటుకు మహిళ మృతి

బిజినపల్లి మండలం మమ్మాయిపల్లిలో పిడుగుపాటుకు మహిళ మృతి చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి పిడుగుపడడంతో వ్యవసాయ పొలంలో బర్రెలను మేపుకుంటున్న నక్క నీలమ్మ(35) అక్కడికక్కడే మృతి చెందింది. అదే సమయంలో అక్కడే ఉన్న అక్క అయిన నాగేంద్రమ్మను (45) స్పృహ తప్పిపోవడంతో 108 అంబులెన్స్ లో హాస్పిటల్కు తరలించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్