నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం తాడూర్ గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి కాలువలో పడటంతో యువకుడు మృతిచెందిన ఘటన గురువారం రాత్రి జరిగింది. కల్వకుర్తి మండలం రఘుపతిపేటకు చెందిన వినోద్డ్ బైక్ పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు రోడ్డుపక్కనే ఉన్న కాలువలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో వినోద్ మృతి చెందాడు. శుక్రవారం పోలీసులు ఘటనా స్థలికి చేరకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.