కోయిలకొండ: రైతుల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తున్నాం

రైతుల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తున్నామని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. బుధవారం కోయిలకొండ మండలం సూరారం గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తరుగు, కోతలు లేకుండా కొనుగోళ్లు చేస్తున్నామని చెప్పారు. రైతులు పండించిన చివరి వరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్