మక్తల్: డీజిల్ కోసం లైన్.. ఏకంగా వాటర్ డ్రమ్ముతో క్యూ.!

మక్తల్ నియోజకవర్గం నర్వ మండలంలో ఐదు రోజులుగా డీజిల్ కొరతతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు బంకుల్లో డీజిల్ అందుబాటులో లేకపోవడంతో వ్యవసాయ పనులు, రవాణా కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఆదివారం ఓ బంకులో డీజిల్ ఉందని సమాచారం రావడంతో వాహనాలతో పాటు క్యాలైన్లతో జనం బారులు తీరారు. కొందరు వాటర్ డ్రమ్ములతో కూడా డీజిల్ కోసం వచ్చారు. మండల కేంద్రంలోని రెండు పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ పరిమితంగానే అందుబాటులో ఉంటుందని, లేకపోతే 25 కిలోమీటర్లు ప్రయాణించి తెచ్చుకోవాలని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్