విద్యుత్ శాఖ ఇంచార్జీ డిఈ గా నరసింహరాజు సోమవారం నారాయణపేట లోని తన కార్యాలయంలో భాద్యతలు స్వీకరించారు. విద్యుత్ శాఖలో సమస్యలు పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా డిఈ అన్నారు. నూతన డిఈ గా బాధ్యతలు స్వీకరించిన నరసింహరాజు భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర జోనల్ కార్యదర్శి వెంకోబా, నాయకులు పాల్గొన్నారు.