నారాయణపేట: డబుల్ రోడ్డు పనులు ప్రారంభించాలని వినతి

నారాయణపేట మండలం అప్పక్ పల్లి గ్రామం నుండి కోయిలకొండ వరకు చేపట్టిన రెండు వరసల రోడ్డు పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని, పనులు ప్రారంభించాలని ఆటో అండ్ మోటార్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం నారాయణపేట కలెక్టరేట్ ఏవో సుధాను కలిసి వినతి పత్రం అందించారు. టీయుసిఐ జిల్లా కార్యదర్శి నరసింహ మాట్లాడుతూ.. కాంట్రాక్టర్ రోడ్డు పనులను మధ్యలో నిలిపి వేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

సంబంధిత పోస్ట్