నారాయణపేట జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

నారాయణపేట జిల్లా కోస్గి మండలం సర్జకన్ పేట్ లోని జిల్లా ప్రాథమిక ఉన్నత పాఠశాలను శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం గుండుమాల్ లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం బొగరం గ్రామ పంచాయతీలో పాఠశాలలో జరుగుతున్న నిర్మాణ పనులను పర్యవేక్షించారు. పనులు నాణ్యతగా చేపట్టాలని, గడువులోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్