నారాయణపేట: ఘనంగా మట్టల పండుగ

నారాయణపేట మండలం సింగారం గ్రామంలో ఆదివారం క్రైస్తవులు మట్టల పండుగను ఘనంగా జరుపుకున్నారు. యేసు ప్రభువును స్మరిస్తూ మట్టలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఇమాన్యూయేల్ చర్చిలో పాస్టర్ నగేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్ నగేష్ మాట్లాడుతూ యేసు ప్రభువు ఇదే రోజున యెరూషలేము వెళ్లిన యేసు ప్రభువును ప్రజలు మట్టలతో స్వాగతం పలికారని, జ్ఞాపకంగా మట్టల పండుగ జరుపుకుంటామని చెప్పారు.

సంబంధిత పోస్ట్