నారాయణపేట: పాఠశాలను సందర్శించిన నేతలు

బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు శుక్రవారం బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజి నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలోని పిఎం శ్రీ పథకానికి ఎంపికైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. కేంద్రం నిధులతో పాఠశాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. డిజిటల్ స్క్రీన్, నర్సరీ, డ్యుయల్ డెస్క్ బెంచిలను పరిశీలించారు. టీచర్లతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్