నారాయణపేట: చిన్నారిపై లైంగిక దాడి చేసిన వ్యక్తికి రిమాండ్

నారాయణపేట పట్టణంలోని ఓ కాలనీలో మూడు రోజుల క్రితం ఓ ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని శుక్రవారం రిమాండ్ చేసినట్లు డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు. నరేశ్ అనే వ్యక్తి మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్