ఎమ్మెల్యే సభిత ఇంద్రారెడ్డిని కించపరుస్తూ మాట్లాడిన సిఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తిరుపతయ్య డిమాండ్ చేశారు. సిఎం వ్యాఖ్యలకు నిరసనగా గురువారం మరికల్ మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తిరుపతయ్య మాట్లాడుతూ మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులకు గౌరవం లేదని, సిఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలని అన్నారు. నాయకులు పాల్గొన్నారు.