వనపర్తి జిల్లా కాంచిరావుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల గదులు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం కంచిరావుపల్లి హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని, నాణ్యత లోపం ఉంటే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.