ఆత్మకూరు మండలంలోని శ్రీరామ్ నగర్ వెళ్లే రహదారిలో బుధవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని అరుదైన జాతికి చెందిన పిల్లి మృతి చెందింది. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి మొదట పులి పిల్ల అని భావించి.. దగ్గరికెళ్లేందుకు భయపడ్డారు. కొంతమంది ధైర్యం చేసి దగ్గరికి వెళ్లి చూడగా అది అరుదైన జాతికి చెందిన పిల్లిగా గుర్తించారు.