వనపర్తి జిల్లాలో వివిధ పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న అక్రిడేషన్, నాన్ అక్రిడేషన్ జర్నలిస్టుల పిల్లలకు జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలలో ఫీజు మినహాయింపును కల్పించాలని మంగళవారం జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ కోరారు. మంగళవారం వనపర్తి టిడబ్ల్యూజేఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయ ఏడి విజయలక్ష్మికి వినతి పత్రాన్ని అందజేశారు.