కోటిలింగేశ్వరదత్త ఆలయంలో వైభవంగా ఆరుద్రోత్సవం

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలో వెలసిన సుప్రసిద్ధమైన శైవక్షేత్రం శ్రీకోటిలింగేశ్వర దత్తదేవస్థానములో ఆరుద్రనక్షత్రం సందర్భంగా గురువారం ఏకాదశ రుద్రాభిషేక పూజలు వైభవంగా నిర్వహించారు. పంచామృతములతో ధూప దీప నైవేద్యంతో భక్తులు పూజ ధ్రవ్యాలతో స్వామివారికి రుద్రాభిషేకం చేశారు. ఈ సందర్భంగా. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ఆలయకమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్