వనపర్తి జిల్లాలో 46 మంది బాల కార్మికులకు విముక్తి కలిగించినట్లు గురువారం ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. బాలల హక్కులను, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ సంవత్సరం జులై 1 నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్కాన్-10 కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించి 46మంది బాలకార్మికులను గుర్తించి సిడబ్ల్యూసి (చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) ముందు హాజరుపరిచినట్లు చెప్పారు.