పాలమూరు ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. ఓట్ల కోసం అభ్యర్థులు వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు. గురువారం వనపర్తి మున్సిపాలిటీలో ఒక అభ్యర్థి ఓటర్ల కాళ్లపై పడి, కన్నీళ్లు పెట్టుకుంటూ ఓట్లు అభ్యర్థించారు. గద్వాలలో మరో అభ్యర్థి రోడ్ షోలో ఏడుస్తూ ఓట్లు వేయాలని కోరారు. ప్రధాన పార్టీల నాయకులు కూడా తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు.