నిలిపిన లారీని తీసుకెళ్లిన ఘటన వనపర్తిలో చోటుచేసుకుంది. బుధవారం పోలీసుల వివరాల ప్రకారం జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన రెహాన్ ఖాన్ తన లారీని ఈ నెల 2న వనపర్తి మార్కెట్ యార్డ్ వద్ద నిలిపి తన గ్రామానికి వెళ్లాడు. మరుసటి రోజు తన లారీ కనిపించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా వనపర్తికి చెందిన హుస్సేన్ చోరీ చేసినట్లు గుర్తించి నిందితుడిని రిమాండ్ కు తరలించారు.