వనపర్తి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ ను సస్పెండ్ చేస్తూ బుధవారం ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న ప్రభు వినయ్ అవినీతి, అక్రమాలపై పూర్తి ఆధారాలతో బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఎక్సైజ్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణ జరిపిన అధికారులు ప్రభు వినయ్ ను సస్పెండ్ చేశారు.