వనపర్తి: కారు, బైకు ఢీ... ముగ్గురికి తీవ్రగాయాలు

వనపర్తి జిల్లా రూరల్ మండలం చిట్యాల మార్కెట్ యార్డ్ ముందు సోమవారం కారు, బైకు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మహదేవన్ పేటకి చెందిన విజేందర్, హేమంత్, శ్రీకాంత్ అనే యువకులు ప్రయాణిస్తున్న బైకును కారు ఢీకొట్టి, సుమారు 50 మీటర్లకు పైగా ఈడ్చుకుపోయింది. క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్స్ ద్వారా వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్