వనపర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది: మాజీ మంత్రి

రైతులకు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రైతు భరోసాలో ఎకరానికి రూ. 15 వేలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు రూ. 12 వేలకు తగ్గించిందన్నారు. రైతు రుణమాఫీలో కోతలు పెట్టినట్లుగానే ఇప్పుడు రైతు భరోసాలో కూడా కోతలు పెట్టేందుకు పంట సాగు చేస్తేనే రైతు భరోసా ఇస్తామని చెబుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్