వనపర్తి: ఎన్ హెచ్ 44 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ టు బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం కారు డీసీఎం ఢీ కొన్నాయి. ప్రమాదంలో కారులో వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో 10 సంవత్సరాల బాలుడు, మహిళ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్