వనపర్తి జిల్లా అమరచింత మండలం చంద్రఘడ్ గ్రామానికి చెందిన లక్ష్మీ కూలి పని నిమిత్తం శనివారం కొంకన్వాణిపల్లి గ్రామానికి వెళ్లింది. పత్తి చేనులో పని చేస్తుండగా పాము కాటేసింది. వెంటనే 108 వాహనంలో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వనపర్తి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు.