వనపర్తి: ధాన్యం తరలింపును వేగవంతం చేయండి

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం తరలింపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వనపర్తి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి విశ్వనాథ్ అన్నారు. బుధవారం వనపర్తి మార్కెట్ యార్డును సందర్శించి నిల్వ ఉన్న వరి బస్తాలను మిల్లులకు తరలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రవాణా వాహనాలు, హమాలీల సమస్య రాకుండా నిర్వాహకులు చూసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్