వనపర్తి: అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం రేచింతల శివారులోని ఊక చెట్టు వాగు నుంచి రేచింతలకి అనుమతి లేకుండా శుక్రవారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్నామని ఆత్మకూరు ఎస్ఐ నరేందర్ తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ హరీశ్ రెడ్డి, ట్రాక్టర్ యజమాని నరసింహారెడ్డిలపై కేసు నమోదు చేశామని అన్నారు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా శిక్ష తప్పదని ఎస్ఐ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్