రష్యాకు చెందిన అథ్లెట్ బాయ్‌త్సవ్, తన స్నేహితులతో కలిసి హాట్ ఎయిర్ బెలూన్‌లో 1800 మీటర్ల ఎత్తుకు వెళ్లి ఫుట్‌బాల్ ఆడి వైరల్ అయ్యాడు. బెలూన్ కింది భాగంలో కృత్రిమ మైదానాన్ని ఏర్పాటుచేసుకుని, పారాచూట్ బ్యాగ్‌లు వేసుకుని ఈ ఆట ఆడిన దృశ్యాలను హెలికాప్టర్ నుంచి రికార్డ్ చేశారు. ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో తరహాలో గోల్ కొట్టి సెలబ్రేట్ చేసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియోను సెర్గీ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశాడు.