మాజీ క్రికెట‌ర్‌పై మండిప‌డ్డ కోచ్ గౌతం గంభీర్‌

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతం గంభీర్, మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ఆస్ట్రేలియా పర్యటనకు యువ బౌలర్ హర్షిత్ రాణా ఎంపికను శ్రీకాంత్ విమర్శించడాన్ని గంభీర్ తప్పుబట్టారు. శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్ కోసం 23 ఏళ్ల క్రికెటర్‌ను విమర్శించడం సిగ్గుచేటని, ఇది అన్యాయమని గంభీర్ అన్నారు. హర్షిత్ రాణా మెరిట్ ఆధారంగానే ఎంపికయ్యారని, అతని తండ్రి సెలెక్షన్ కమిటీలో లేరని, అతను ఎన్ఆర్ఐ కూడా కాదని గంభీర్ స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్