టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భారత క్రికెట్ వర్గాల్లో వివాదాల చర్చ జరుగుతోంది. తాజాగా, బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, గంభీర్ మధ్య సంబంధాలు సవ్యంగా లేవని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. న్యూజిలాండ్‌తో నాలుగో టీ20లో ఇషాన్ కిషన్ స్థానంలో శ్రేయస్‌కు బదులు అర్ష్‌దీప్ సింగ్‌ను ఆడించడంపై అంతర్గత కారణాలున్నాయని, గంభీర్ హయాంలో శ్రేయస్‌కు సరైన అవకాశాలు లభించడం లేదనే భావన వ్యక్తమవుతోంది. కీలక నిర్ణయాలన్నీ గంభీర్ చేతుల్లోనే ఉన్నాయని టాక్ నడుస్తోంది.