తొలి టెస్టు ఓటమిపై గంభీర్ కీలక వ్యాఖ్యలు

తొలి టెస్టులో ఓటమిపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భారత బ్యాటర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. పిచ్ తమకు అనుకూలంగానే ఉందని, అయితే బ్యాటర్లు సరిగ్గా ఆడలేదని ఆయన అన్నారు. 'మేము కోరుకున్న పిచ్‌నే క్యూరెటర్ ఇచ్చాడు. పిచ్‌పై కాదు, టర్న్ ఆడటం తెలిసి ఉండాలి. 124 పరుగులు ఛేదించగలిగేదే. డిఫెన్స్ ఆడితే పరుగులు చేయొచ్చు. ఈ పిచ్‌పై బిగ్ షాట్స్ ఆడలేం కానీ, డిఫెన్స్ ఆడగలిగితే రన్స్ చేసేదే. బవుమా హాఫ్ సెంచరీ చేశాడు, అక్షర్, సుందర్ కూడా పరుగులు రాబట్టారు. కాబట్టి పిచ్ గురించి మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు' అని గంభీర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్