జనవరి 4న రాజమండ్రిలో 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న రిలీజ్ కానుంది. ఇటీవలే అమెరికాలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవంతం కావడంతో.. చిత్రబృందం ఆ ఊపులోనే ఏపీలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేసింది. ఇవాళ నిర్మాత దిల్ రాజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిశారు. పవన్‌తో మాట్లాడిన అనంతరం ఈవెంట్‌ను జనవరి 4న రాజమండ్రిలో నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్