ఓటీటీల విస్తృతితో వెబ్ సిరీస్‌లు పెరిగినా, 15 ఏళ్లుగా డిజిటల్ ప్రపంచాన్ని ఏలుతూ, ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్ జియోహాట్‌స్టార్‌లో మోస్ట్ వాచ్డ్‌గా కొనసాగుతోంది. 2011 ఏప్రిల్ 17న విడుదలైన ఈ ఫాంటసీ డ్రామా, 8 సీజన్లు, 74 ఎపిసోడ్‌లతో రాజకీయాలు, కుట్రలు, డ్రాగన్స్ వంటి అంశాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. IMDbలో 9.2 రేటింగ్‌తో ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన సిరీస్‌గా నిలిచింది. భారీ బడ్జెట్, గ్రాండ్ విజువల్స్, నటీనటుల ప్రదర్శనతో ఇది ఒక విజువల్ వండర్‌గా మారింది. భారతదేశంలోనూ దీనికి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం హిందీతో పాటు పలు భారతీయ భాషల్లోనూ అందుబాటులో ఉంది.