కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుందాపుర సమీపంలోని ఆనెగుడ్డె శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం పురాణ విశ్వాసాలకు ప్రసిద్ధి చెందింది. కుంభాసురుడు అనే రాక్షసుడిని భీముడు సంహరించిన తర్వాత ఈ ప్రాంతంలో వర్షాలు కురిసి సుభిక్షంగా మారిందని స్థలపురాణం చెబుతోంది. యాగానికి ముందు పాండవులు గణపతిని ప్రతిష్ఠించారని భక్తుల విశ్వాసం. ఆలయంలో స్వామివారు వెండి కవచంతో ప్రత్యేక రూపంలో దర్శనమిస్తారు. ‘ఆనె’ అంటే ఏనుగు, ‘గుడ్డె’ అంటే కొండ అని అర్థం. ఉడిపికి 30 కి.మీ దూరంలో ఉన్న ఈ క్షేత్రాన్ని భక్తులు విశేషంగా దర్శించుకుంటారు. ఇలాంటి ఆలయ విశేషాలను ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోవచ్చు.