కాంగ్రెస్ నేతలకు మూతులు తెరిస్తే బూతులే వస్తున్నాయని.. గాంధీ భవన్‌ను గలీజు భవన్‌గా మార్చారని BRS నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు సంస్కారం మరచివిలువలు లేకుండా వ్యవహరిస్తూ.. రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. 'కాంగ్రెస్ అబద్ధాల ప్రచార కమిటీ సభ్యుడైన చామలకు ఏ ప్రాజెక్టు ఏ బేసిన్‌లో ఉందో తెలీదు. SRSPని SSRP అని చామల అంటుండు. ఆయన వార్డు మెంబెర్‌కు ఎక్కువ ఎంపీకి తక్కువ' అని ఎద్దేవా చేశారు.