TG: పీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని తెలిపారు. నెహ్రూ కుటుంబం ఆగర్భ శ్రీమంతుల కుటుంబమైనా దేశం కోసం ప్రాణాలు ఇచ్చి, ఆస్తులు ధారపోసిందని అన్నారు. మహాత్మా గాంధీని హత్య చేసిన పార్టీ బీజేపీ అని, స్వాతంత్ర్యం రావడంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రముఖ పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు.