గాంధీజీ పదో తరగతి మార్కులు వైరల్: 39.6%తో 404వ ర్యాంకు!

ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న మహాత్మా గాంధీ పదో తరగతి మార్కుల జాబితా ఆయన సాదాసీదా విద్యార్థి అని స్పష్టం చేస్తోంది. బాంబే యూనివర్సిటీ పరిధిలో మెట్రిక్యులేషన్ పరీక్ష రాసిన గాంధీజీకి 625కి 247.5 మార్కులు (39.6%) వచ్చాయి, ఆయన 404వ ర్యాంకు సాధించారు. ఇంగ్లీష్‌లో 89, గుజరాతీలో 45.5, గణితంలో 59, జనరల్ నాలెడ్జ్‌లో 54 మార్కులు వచ్చాయి. ఈ మార్కులు ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించకుండా అడ్డుకోలేకపోయాయి.జీవితంలో విజయం సాధించడానికి మార్కులు ఒక్కటే కొలమానం కాదని, పట్టుదల, కష్టపడే తత్వం, నిజాయితీ ఉంటే ఏ రంగంలోనైనా అద్భుతాలు సృష్టించవచ్చని గాంధీజీ జీవితం నిరూపిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్