గాంధీజీ ఉద్యమాలు: స్వాతంత్ర్య సంగ్రామానికి కీలక ఘట్టాలు

మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షపై సత్యాగ్రహం చేసి, భారతదేశానికి తిరిగి వచ్చాక స్వాతంత్ర్య సంగ్రామాన్ని ప్రజా ఉద్యమంగా మలిచారు. ఆయన నాయకత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమం (1920) బ్రిటీష్ వస్తువులు, విద్యాసంస్థలు, ఉద్యోగాలను బహిష్కరించాలని పిలుపునిచ్చింది. 1930లో ఉప్పుపై బ్రిటీష్ ప్రభుత్వం విధించిన అన్యాయమైన పన్నును నిరసిస్తూ దండి యాత్ర చేపట్టారు. 1942లో 'డూ ఆర్ డై' నినాదంతో క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా బ్రిటీష్‌వారిని భారత్‌ను వదిలి వెళ్లాల్సిందిగా హెచ్చరిస్తూ ఆఖరి పోరాటం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕