TG: హైదరాబాద్లోని చార్మినార్ పత్తర్‌ఘట్టి రహదారిపై గణేశ్ శోభయాత్ర కొనసాగుతుండగా ఓ వాహనం పైనుంచి విగ్రహం కిందపడింది. దీంతో అక్కడే ఉన్న ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకుని క్రేన్ సహాయంతో విగ్రహాన్ని తరలించారు.