TG: గణేష్ నిమజ్జనం సందర్భంగా శనివారం రాత్రి ట్యాంక్‌బండ్ వద్ద కేసీఆర్ పాటలు ప్లే చేసిన డీజే బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 'దేఖ్లేంగే' అనే కేసీఆర్ పాట ప్లే చేసినందుకు డీజే బాక్సులను బద్దలుకొట్టడానికి కూడా పోలీసులు ప్రయత్నించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో, కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పాటలకు భయపడుతోందని నెటిజన్లు పోలీసుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.