హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోని పత్తికుంట చెరువు వద్ద శనివారం ఉదయం గణేశుడి నిమజ్జన ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. టస్కర్‌పై వినాయకుడి విగ్రహాన్ని తరలిస్తుండగా, లంగర్‌హౌస్‌లో పిల్లర్ నంబర్ 96 వద్ద ప్రమాదవశాత్తూ విగ్రహం వెనక్కి పడిపోయింది. పోలీసులు క్రేన్ సహాయంతో విగ్రహాన్ని తొలగించే చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.