బొప్పాయిలో వినాయకుడు.. భక్తుల పూజలు (వీడియో)

ఏపీలోని కాకినాడ జిల్లాలో తాజాగా ఆసక్తికర ఘటన జరిగింది. గండేపల్లి మండలం సాగరపేటలో ఓ వ్యక్తి తమ ఇంట్లో బొప్పాయి చెట్టుకు కాసిన తొలి కాయను వినాయకునికి సమర్పించాలనుకున్నాడు. దానిని తీసుకొచ్చి గణనాథునికి నైవేద్యంగా పెట్టాడు. అయితే బొప్పాయి కాయలోపల విఘ్నేశ్వరుని రూపం కనిపించింది. దీంతో ఈ ప్రత్యేకమైన బొప్పాయిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. దానికి పూజలు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్