TG: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగామలోని పంచలింగేశ్వర దేవస్థానంలో కొలువుదీరిన గణనాథునికి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన గణేశ్ లడ్డూ వేలంపాటలో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మాచారం గ్రామానికి చెందిన సంగమేశ్వర్ రూ.17,00,001కు లడ్డూను దక్కించుకున్నారు. నిర్వాహకులు సంగమేశ్వర్ను అభినందించి లడ్డూను అందజేశారు.