AP: అనంతపురంలో సైబర్ క్రైమ్ ముఠాను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. కాగా దీనికి సంబంధించిన వివరాలన్నీ అనంతపురం ఎస్పీ జగదీశ్ వెల్లడించారు. కాంబోడియా దేశం నుంచి నకిలీ యాప్‌ల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి దగ్గర నుంచి రూ.41లక్షల నగదు, భారీగా క్రెడిట్, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.