కల్తీ ఉస్మానియా బిస్కెట్‌ల తయారీ ముఠా గుట్టు రట్టు

హైదరాబాద్‌లో కల్తీ ఉస్మానియా బిస్కెట్‌ తయారీ ముఠా గుట్టురట్టయింది. నగరకేంద్రంలోని బాబుల్‌ రెడ్డి నగర్, లక్ష్మీగూడ ప్రాంతాల్లో నాణ్యతలేని సరుకులు, రసాయనాలతో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్న ముఠాను మైలార్‌దేవ్ పల్లి పోలీసులు, H-ఫాస్ట్ బృందాలు పట్టుకున్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో బిస్కెట్లు తయారు చేసి కిరాణా షాపులు, బేకరీలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అరుణ్ కుమార్, మస్తాన్ రెడ్డి, విశాల్ జైన్ అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, నకిలీ స్నాక్స్, ఫుడ్ కలర్స్, రసాయనాలు, వాడిన వంట నూనె సహా రూ.3.35 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్