సామూహిక అత్యాచారం.. అయిదుగురు అక్ర‌మ వ‌ల‌స‌దారులు అరెస్టు

ఇటలీ రాజధాని రోమ్‌లో కొలంబియాకు చెందిన 32 ఏళ్ల మహిళపై 22 మంది అక్రమ వలసదారులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గత వారం జరిగిన ఈ ఘటనలో, మహిళను బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించి, వాడకంలో లేని భవనానికి తరలించారు. అక్కడ మూడు రోజుల పాటు ఆమెకు డ్రగ్స్ ఇచ్చి, బెదిరించి అత్యాచారం చేశారు. అక్కడనుండి తప్పించుకున్న ఆమెను ఒక వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు, ఇమ్మిగ్రేషన్ అధికారులు కలిసి భవనంపై దాడి చేసి, ఐదుగురు ఆఫ్రికా మూలాలున్న వ్యక్తులను అరెస్టు చేశారు. మరో 11 మంది వలసదారులను బహిష్కరించారు.

సంబంధిత పోస్ట్